నెల్లూరు పట్టణానికి విచ్చేసిన బంగారు టాటా నానో

టాటా గ్రూపులోని స్వర్ణాభరణాల విభాగం అయిన 'టాటా గోల్డ్ ప్లస్' కంపెనీ ప్రచారంలో భాగంగా ఈ బంగారు నానో కారును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గోల్డ్ ప్లస్ అవుట్‌లెట్లలో ఈ కారును ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇందులో భాగంగానే కంపెనీ తమ బంగారు నానో కారును నెల్లూరులో ప్రదర్శనకు ఉంచింది.
భారతదేశంలో బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమ మొదలై 5,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టైటాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ కారును రూపొందించింది. దీని తయారీకి 80 కేజీల స్వచ్ఛమైన బంగారాన్ని, 15 కేజీల వెండిని మరియు 10,000 రత్నాలను ఉపయోగించారు.
ఈ బంగారు నానో కారు తయారీకి కంపెనీ సుమారు రూ.22 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అంతేకాదు.. ఈ కారు భద్రత కోసం కంపెనీ సగటున రోజుకు లక్ష రూపాయల ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బంగారు నానో కారు మరో మూడు నెలల పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గోల్డ్ ప్లస్ షోరూమ్‌లలో ప్రదర్శనకు ఉంచనున్నారు.


Click it and Unblock the Notifications








