'స్ట్రీట్ వ్యూ' చిత్రాల కోసం బెంగుళూరు రోడ్లపై సంచరిస్తున్న గూగుల్

Google Car
అంతర్జాల (ఇంటర్నెట్) దిగ్గజం గూగుల్ అందిస్తున్న అద్భుతమైన ఫీచర్ 'గూగుల్ మ్యాప్స్'. ఈ గూగుల్ మ్యాప్స్‌ను మరింత లైవ్లీగా మార్చేందుకు మ్యాప్స్‌లో ఓ భాగమైన స్ట్రీట్ వ్యూ అప్లికేషన్‌ను కంపెనీ తయారు చేసింది. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్‌ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ ఈ అప్లికేషన్‌ను రూపొందించి.

గత 2007లో ప్రారంభమైన గూగుల్ మ్యాప్స్‌లోని స్ట్రీట్ వ్యూ ఆప్షన్ ఇప్పటికే 27 దేశాల్లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకూ ఇతర దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ స్ట్రీట్ వ్యూ ఫీచర్ తొలిసారిగా మన దేశానికి వచ్చింది. అంటే ఇకపై మన దేశంలోని పలు ప్రముఖ ప్రదేశాల చిత్రాలను కూడా గూగుల్ మ్యాప్స్‌లో తిలకించ వచ్చన్నమాట. ఇందులో భాగంగానే దేశ ఐటి రాజధానిగా ఎదుగుతున్న బెంగుళూరు నగరంలో గూగుల్ వాహనాలు హల్ చల్ చేశాయి.

చెవర్లే బ్రాండ్ కార్లకు పైభాగంలో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలు అమర్చి సిటీ మొత్తాన్ని చుట్టేసి బెంగుళూరు నగర వీధలను, ప్రముఖ ప్రదేశాలను తమ కెమెరాలలో బందించేశాయి. ఈ చిత్రాల మ్యాప్‌ను గూగుల్ తన 'స్ట్రీట్ వ్యూ'లో ఉంచనుంది. ఇందులో మరో అద్భుతమైన అంశం ఏంటంటే.. ఈ ఫోటోలు చిత్రీకరించేటప్పుడు చిత్రాల్లో వ్యక్తులు క్యాప్చూర్ అయినప్పటికీ అప్లికేషన్‌లో మాత్రం వారి ఐడెంటిటీ తెలియనీయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని గూగుల్ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, May 27, 2011, 17:27 [IST]
English summary
Google has announced that it will begin imagery collection in Bangalore for the Street View feature in Google Maps. Google cars and trikes will today begin driving and taking street level photographs of public locations around the city.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+