ప్రభుత్వానికి అక్షయ పాత్ర.. దేశీయ ఆటో రంగం

ED on Cars
దేశీయ ఆటోమొబైల్ రంగం ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారింది. గడచిన ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2010 - మార్చి 2011)లో ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏకంగా 26 శాతానికి ఎగబాకింది. ఈ సమయంలో భారత ఆటోమొబైల్ రంగం ప్రోత్సాహకర (30 శాతం) వృద్ధిని కనబరిచిన సంగతి తెలిసిందే. 2010-11 ఆర్థిక సంవత్సరంలో 5,001 కోట్ల రూపాయలను ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి ప్రఫుల్ పటేల్ పార్లమెంటులో తెలిపారు.

అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2009-10)లో ఈ ఆదాయం రూ. 3,958 కోట్లుగా ఉన్నట్లు ఆయన వివరించారు. కాగా.. 2010-11 దేశీయ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో 30 శాతం వృద్ధి చెంది 2 మిలియన్లుగా నమోదయ్యాయి, అలాగే ఉత్పత్తి కూడా 27 శాతం పెరిగి 2.45 మిలియన్లుగా నమోదయ్యింది. కేంద్ర బడ్జెట్ 2010-11లో ప్రభుత్వం సుంఖాన్ని కేవలం 2 శాతం మేర మాత్రమే పెంచినప్పటికీ ఎక్సైజు సుంఖం ద్వారా ఇంత భారీ స్థాయిలో ఆదాయాలు రావడం గమనార్హం.

ప్రస్తుతం చిన్న కార్లపై ఎక్సైజ్ సుంఖం 10 శాతం గానూ, పెద్ద కార్లపై 22 శాతం గానూ ఉంది. ఏదేమైనప్పటికీ, 2010-11 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం కేవలం 5 శాతం మాత్రమే వృద్ధి చెంది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2009-10)తో పోలిస్తే రూ. 14,482 కోట్ల నుంచి రూ. 15,276 కోట్లకు పెరిగింది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 17, 2011, 11:41 [IST]
English summary
The Central Government collected Rs 5,001 crore from domestic auto sector as excise duty in the previous fiscal (2010-11). The contribution in this sector in the form of excise duty went up 26 per cent in 2010-11, Union Minister for Heavy Industries, Praful Patel told in Parliament.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+