ఇంధన బాదుడుకు రంగం సిద్ధం.. త్వరలోనే వడ్డింపు..!!

ఈ మేరకు త్వరలోనే మంత్రుల సాధికారిక కమిటీని ఏర్పాటు చేసి డీజిల్, ఎల్‌పిజి మరియు కిరోసిన్ ధరలు సవరించాలని పెట్రోలియం శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖమంత్రి ప్రణబ్ ముఖర్జీని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం చమురు సంస్థలు ప్రతి లీటర్ డీజిల్ విక్రయంపై రూ.9.27, ప్రతి టరు కిరోసిన్‌పై రూ.26.94 మరియు ప్రభుత్వ సబ్సిడి ద్వారా సరఫరా చేసే ఎల్‌పిజిపై రూ.260.50 చొప్పున నష్టపోతున్నాయి.
వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితేనే దేశీయ మార్కెట్లో చమురు ధరలు కూడా పెంచాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, రూపాయి విలువతో పోల్చుకుంటే డాలర్ విలువ ఎక్కువగా ఉండటంతో పెట్రోల్ ధర పెంచి తీరాల్సిందేనని చమురు సంస్థలు పట్టపడుతున్నాయి.


Click it and Unblock the Notifications








