తప్పుడు వాహనాలు తయారు చేస్తే తిప్పలు తప్పవు!

ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ నిపుణుల కమిటీని కూడా నియమించిది. వాహన తయారీదారులు లోపపూరిత వాహనాలను తయారు చేసినట్లు తేలితే. ప్రతి వాహనంపై లక్ష రూపాయాల జరిమానా కానీ లేదా మూడు నెలల జైలు శిక్ష కానీ లేదా రెండు శిక్షలను కానీ విధించేటట్లుగా ప్రణాళికలను రచిచండం జరుగుంతోంది.
ఈ మేరకు మోటార్ వాహన చట్టాలలో సవరణలు చేయాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇటీవలి కాలంలో వివిధ కంపెనీలు విక్రయించిన వాహనాలలో లోపాల కారణంగా వాటిని వెనక్కు పిలిపిస్తున్న (రీకాల్) సంఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రణాళికలను సిద్ధం చేస్తుండటం గమనార్హం.
ఇదే గనుక అమలులోకి వస్తే.. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన కార్లలో ఏదైనా లోపం ఉన్నట్లు గుర్తిస్తే, సదరు కార్ కంపెనీపై వినియోగదారుడు నేరుగా రాష్ట్ర రవాణా అథారిటీ (ఎస్‌టిఏ) వద్ద ఓ ఫిర్యాదు నమోదు చేయవచ్చు. దానికి అనుగుణంగా నిపుణులు ఈ కేసును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications








