ధర చెప్పు.. ఎక్స్‌యూవీ500 గెల్చుకో..: ఎమ్ అండ్ ఎమ్

Mahindra XUV500
మహీంద్రా అండ్ మహీంద్రా తొలిసారిగా ప్రపంచ మార్కెట్ల కోసం రూపొందించిన ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) "ఎక్స్‌యూవీ500" (ఎక్స్‌యూవీ ఫైవ్ డబుల్ ఓ)కు సంబంధించి ఓ సరికొత్త కాంటెస్ట్‌ను ప్రారంభించింది. 'ధరను అంచనా వేయు, ఎక్స్‌యూవీ500'ను గెలుచో అనే కాంటెస్ట్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా ప్రారంభించింది.

ఈ గ్లోబల్ ఎస్‌యూవీ ఈ నెల 28న విడుదల కావచ్చనని అంచనా. ఈ నేపథ్యంలో తమ కొత్త ఎక్స్‌యూవీ500 ధరను ఖచ్చితంగా అంచనా వేసిన వారికి ఓ కొత్త ఎక్స్‌యూవీ500 వాహనాన్ని బహకరిస్తాన్ మహీంద్రా తన అధికారి వెబ్‌సైట్‌లో పేర్కొంది. అంతేకాకుండా.. ఇతర ప్రైజ్ కింద 20 ఎఫ్1 రేస్ టికెట్లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది. డబ్ల్యూ201 (W201) ప్రాజెక్ట్ కోడ్ పేరుతో రూపొందుతున్న ఈ గ్లోబల్ ఎస్‌యూవీకు "ఎక్స్‌యూవీ500" (XUV500) అనే పేరును ఖరారు చేసినట్లు ఇటీవలే ఎమ్ అండ్ ఎమ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

మహీంద్రా అండ్ మహీంద్రా ఆధ్వర్యంలో నిర్మితిమవుతున్న తొలి గ్లోబల్ ఎస్‌యూవీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌యూవీ500 డిజైన్ మరియు డెవలప్‌మెంట్‌ను పూర్తిగా ఎమ్ అండ్ ఎమ్ కంపెనీయే నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుంచి ముఖ్యమైన అంశాలను సేకరించి దీని స్టైలింగ్ మరియు డెవలప్‌మెంట్‌లో అమలు చేశామని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది.

మహీంద్రా అండ్ మహీంద్రా గతంలో వెల్లడించినదాని ప్రకారం, కొత్త ఎక్స్‌యూవీ500 కారును ధరలో స్కార్పియోకు ఎగువన ప్రవేశపెట్టే ఆస్కారం ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం స్కార్పియో ఎస్‌యూవీ ధర రూ. 8.77 లక్షల నుండి 13.42 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మరింకెందుకు ఆలస్యం మహీంద్రా ఎక్స్‌యూవీ500 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ ఎస్‌యూవీ ధర ఎంతో గెస్ చేసి మీ అధృష్టాన్ని పరీక్షించుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, September 19, 2011, 17:54 [IST]
English summary
Mahindra, the leading Indian SUV maker has launched a unique way of garnering attention to its soon to be launched Global SUV, the XUV500. The company has launched a new website, where visitors can guess the price of the car and stand a chance of winning the XUV500.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+