హర్యానా సమ్మెకు, గుజరాత్ ప్లాంటుకు సంబంధం లేదు!

అయితే, ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. మారుతి సుజుకి పెదవి విప్పింది. హర్యానాలో మానేసర్ ప్లాంటులో తలెత్తిన కార్మికుల సమ్మెకు, గుజరాత్‌లో తాము ఏర్పాటు చేయబోతున్న కొత్త ప్లాంటు ఎలాంటి సంబంధం లేదని మారుతి సుజుకి స్పష్టం చేసింది. హర్యానా రాష్ట్రం నుంచి మారుతి సుజుకి వైదొలగి గుజరాత్‌కు తరలిపోతుందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తం లేదని కంపెనీ పేర్కొంది.
వాస్తవానికి మారుతి సుజుకి మానేసర్ ప్లాంటు కార్మిక అశాంతి ఏర్పడక ముందు నుంచే గుజరాత్‌లో ప్లాంటు ఏర్పాటును గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని గుర్తు చేసింది. కాగా.. హర్యానా రాష్ట్రంలో కొత్త యూనిట్ల ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణకు రెండేళ్లలో రూ.3,700 కోట్ల పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించామని మారుతి సుజుకి వెల్లడించింది.
గుజరాత్‌లో మారుతి సుజుకి ఏర్పాటు చేయదలచిన కొత్త ప్లాంటు కోలం మెహసణ జిల్లాలో 1500 ఎకరాల భూమి కసరత్తులు చేస్తుంది. ఇందులో 400 ఎకరాల భూమిని కంపెనీ వెండర్లకు కేటాయించనున్నట్లు గతంలో మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్ సి భార్గవ వెల్లడించారు.


Click it and Unblock the Notifications








