లగ్జరీ కార్ తయారీదారులను ఆకర్షిస్తున్న గుజరాత్

గుజరాత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆటోమార్కెట్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు కొత్త లగ్జరీ కార్ల కంపెనీలు ఆ రాష్ట్రం వైపు అడుగులు వేస్తుండగా.. ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిఎమ్‌డబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే దిశగా అడగులు వేస్తున్నాయి. ఒకప్పుడు గుజరాత్ లగ్జరీ కార్ మార్కెట్లో కేవలం 100 కార్లు మాత్రమే అమ్ముడైతే ఇప్పుడు అది గత ఆర్థిక సంవత్సరంలో 1,000 కార్లకు ఎగబాకిందంటేనే ఇక్కడి మార్కెట్ ఎంత వేగంగా వృద్ధి చెందుతుందో ఇట్టే అర్థమవుతుంది.
ఆడి అహ్మదాబాద్ సీఓఓ మాట్లాడుతూ.. సూరత్‌లో కూడా మరో షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆడి ప్రయత్నిస్తోందని, ఇక్కడ తమ వృద్ధి రేటు 112 శాతంగా ఉందని, గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క గుజరాత్‌లోనే 300 కార్లకు పైగా విక్రయించామని తెలిపారు. అలాగే టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటన్ యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) కూడా అహ్మదాబాద్‌లో కొత్త డీలర్‌షిప్‌ను ఏర్పాటు చేయనుంది. పార్షే కూడా గుజరాత్‌లో కాలు మోపేందుకు తహ తహ లాడుతోంది. ఇవే కాకుండా హ్యార్లీ డేవిడ్‌సన్ వంటి ప్రిమీయం బైక్ కంపెనీలు గుజరాత్ మార్కెట్‌పై కన్నేశాయి.


Click it and Unblock the Notifications








