రికార్డు స్థాయిలో లగ్జరీ కార్లను కొనుగోలు చేయనున్న గల్ఫ్ దేశాలు

RR Ghost
అసలే అరబ్ దేశాలు, విలాసాలకు పెట్టింది పేరు, కోట్లకు కోట్లు ధనం మూలుగుతున్న దేశాలు. ఇక వారికి విలాసవంతమైన కార్లు కొనుక్కోవడం పెద్ద లెక్కా చెప్పండి. విషయం ఏంటంటే.. ఈ ఏడాది గల్ఫ్ దేశాల్లో లగ్జరీ కార్లు కొనేవారి గణనీయంగా పెరగనుందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్కడి దేశాలలో బిఎమ్‌డబ్ల్యూ, రోల్స్ రాయిస్, మాసేరటి, పోర్షే వంటి లగ్జరీ కార్ల విక్రయదారులు ఈ ఏడాది భారీగా లబ్ధి పొందనున్నారు.

తాజా గణాంకాలను బట్టి చూస్తే.. ఈ ఏడాది యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)తో పాటు గల్ఫ్ దేశాలలో హై-ఎండ్ కార్ల అమ్మకాలు దాదాపు 20 శాతం మేర పెరగవచ్చునని తెలుస్తుంది. గతేడాది దీని పరిమాణం కేవలం 9.7 శాతం మాత్రమే. అంటే ఈ దేశాలలో లగ్జరీ కార్ మార్కెట్ రెండింతలకు పెరగనుందన్నమాట. ఐహెచ్ఎస్ ఆటోమోటివ్ తెలిపినదాని ప్రకారం, విక్రయాల పెరుగుదల భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందని, 2010 నుండి 2015 నాటికి రెండింతలకు పైగా మార్కెట్ వృద్ధి చెందుతుందని, ప్రపంచ వ్యాప్తంగా ఇది 51 శాతానికి పెరగవచ్చునని అంచానా వేసింది.

More from DriveSpark

Article Published On: Thursday, July 7, 2011, 13:29 [IST]
English summary
According to the recent released data Gulf countries (including the UAE) to buy record number of luxury cars in 2011. High-end cars sales in Gulf will probably grow by 20 per cent this year, more than double the overall rate of 9.7 per cent in the segment last year a report said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+