సమ్మె కారణంగా 850 యూనిట్ల ఉత్పత్తి నష్టపోయిన జిఎమ్

దీంతో సదరు వర్కర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తమ న్యాయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు చేపట్టామని జనరల్ మోటార్స్ ఉపాధ్యక్షుడు పి బాలేంద్రన్ వెల్లడించారు. మార్చి 25లోగా తిరిగి విధుల్లోకి రాకపోతే.. ఉద్యోగం నుంచి తీసేస్తామని సమ్మె చేస్తున్న 250 వర్కర్లకు కంపెనీ అల్టిమేటం జారీ చేసింది. అయితే వర్కర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇందుకు మరికొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.
హలోల్ ప్లాంటులో మొత్తం 900 మంది కార్మికులు ఉండగా.. 250 మంది ఇప్పటికీ గైర్హాజరీలో ఉన్నారని, ప్రస్తుతం ఒకే షిఫ్టు కింద ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. గతంలో రోజుకి 190 కార్లను ఉత్పత్తి చేసే ప్లాంటులో సమ్మె వల్ల ఇప్పుడు దాదాపు 100 యూనిట్లు మాత్రమే తయారవుతున్నాయని ఆయన వివరించారు. ఈ ఫ్యాక్టరీలో ఏటా 85,000 కార్లను ఉత్పత్తి చేసే సామార్థ్యం వుంది.


Click it and Unblock the Notifications








