ఇంగ్లాండ్‌లో హ్యారీపోట్టర్ ఎగిరే ఫోర్డ్ ఏజింలా కారు వేలం..!

Harry Potter Flying Ford Anglia
హ్యారీపోట్టర్‌ సినిమా గురించి తెలియనివారు ఉండకపోవచ్చు. అద్భుతమైన వింతలు, అబ్బురపరిచే విన్యాసలతో కూడిన ఈ సినిమా ఎన్నో భాగాలు వస్తూ.. చిన్నపిల్లల దగ్గర నుంచీ పెద్దవాళ్ల వరకూ అందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. హ్యారీపోట్టర్‌ చిత్రంలో రాన్ వేస్లీ (హీరో) పాత్ర పోషించిన రూపెర్ట్ గ్రింట్ ఆ చిత్రంలో ఉపయోగించిన ఎగిరే ఫోర్డ్ కారును వేలం వేయనున్నారు. 1919 మోడల్‌‌కు చెందిన "ఫోర్డ్ ఏంజిలా" కారుకు లండన్‌లో ఆక్షన్ నిర్వహించనున్నారు. ఎగిరే కారు అంటే నిజంగా ఎగిరేది కాదండోయ్.. సినిమాలో అంటే గ్రాఫిక్స్ వల్ల అలా ఎగిరిందే తప్ప నిజంగా ఎగరలేదనుకోండి.

ప్రస్తుతం ఈ ఫోర్డ్ ఏంజిలా కారు ఇంగ్లండ్‌లోని లేక్‌ జిల్లాలో స్టార్‌ మ్యూజియం (కార్ల మ్యూజియం)లో కొలువుదీరి ఉంది. ఈ కారుతో పాటుగా స్టార్‌ మ్యూజియం అధినేత పీటర్‌ నెల్సన్‌ సేకరించిన వివిధ హాలీవుడ్‌ వాహనాలను కూడా వేలం వేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే హ్యారీపోట్టర్‌ ఉపయోగించిన 1919 మోడల్‌ పోర్డ్‌ ఏంజిలా కారును కూడా వేలం వేయనున్నారు. ఆన్‌లైన్‌లో ఈబే వెబ్‌సైట్ ద్వారా ఈ వేలం నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించారు. డిలోరియాన్‌తో పాటు దాదాపు పది వాహనాలను (హాలీవుడ్‌ సినిమాలలో ఉపయోగించినవి) 'బ్యాక్‌ టు ది ప్యూచర్' పేరుతో ఈ వేలం నిర్వహిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, February 24, 2011, 17:18 [IST]
English summary
Hollywood's block buster movies Harry Potter hits the headline again. The actor Rupert Grint, who plays Ron Weasley used a Ford car in this movie. Now that 1919 model flying Ford Anglia car goes under hammer in England.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+