మానేసర్ కార్మికుల సమ్మెను నిషేధించిన హర్యానా ప్రభుత్వం

కార్మికుల సమ్మె అంశాన్ని 1947 పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం పరిశీలించాలంటూ స్థానిక లేబర్ కోర్టుకు నివేదించినట్లు ఆయన తెలిపారు. ఈ సమ్మె కారణంగా మోనేసర్ ప్లాంటులో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఇది విడిభాగాల సప్లయర్లపై కూడా తీవ్ర ప్రభావాలను చూపింది. గడచిన శనివారం మధ్యాహ్నం నుంచి దాదాపు 2,000 మంది సమ్మె చేస్తున్న సంగతి తెలిసింది. దీని ఫలింతగా 300 కోట్ల రపాయలకు పైగా నష్టపోయినట్లు అంచనా.
కాగా.. హర్యానా ప్రభుత్వం సమ్మె నిషేధించడాన్ని మారుతి సుజుకి స్వాగతించింది. తాము ఇది వరకే ఈ సమ్మె అక్రమమైనదని వాదించామని, ప్రభుత్వం నిర్ణయంతో తమ వాదన నిజమని రుజువైందని కంపెనీ పేర్కొంది. గత వారం రోజులుగా ప్లాంటు మూత పడటంతో పనిచేయని వర్కర్లకు జీతాలు ఇచ్చే అంశంపై కూడా కంపెనీ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'నో వర్క్ - నో పే' నిబంధనను అమలు చేయాలని మారుతి సుజుకి భావిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








