మారుతి సుజుకి మానేసర్ సమ్మె పూర్తిగా ముగిసినట్లేనా..!?

జూన్ 3వ తేదీన మానేసర్ వర్కర్లు తమ కొత్త యూనియన్ 'మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్'ను ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించాలంటూ హర్యానా లేబర్ డిపార్ట్‌మెంట్‌ను ఆశ్రయించారు. ఆ వెంటనే 4వ తేదీ సాయంత్రం నుంచి సమ్మెకు దిగారు. అయితే వాస్తవానికి కొత్త యూనియన్‌ను ఏర్పాటు చేయడానికి ట్రేడ్ యూనియన్ చట్టంలోని ప్రభుత్వ విధివిధానాలను బట్టి కనీసం మూడు నెలల సమయం పడుతుందని లేబర్ డిపార్ట్‌మెంట్ అంటోంది. మరి అంత కాలం కార్మికులు వేచి చూస్తారో లేక మరోసారి సమ్మె బాట పడుతారో కాలమే నిర్ణయించాలి.
కాగా.. 13 రోజుల పాటు జరిగిన సమ్మె గురవారం అర్థరాత్రి ముగియడంతో ఈ రోజు ఉదయం నుంచి మానేసర్ ప్లాంటులో ఉత్పత్తి యధాతథంగా ప్రారంభమైంది. వర్కర్లకు యాజమాన్యానికి కుదిరిన సయోధ్య ప్రకారం తొలగించిన 13 మంది కార్మికులను తిరిగి పనిలోకి తీసుకునేందుకు కంపెనీ అంగీకరించడమే కాకుండా, నో వర్క్ నో పే ప్రాతిపదికన ఒక రోజు సమ్మెకు కానూ మూడు రోజుల చొప్పున జీతంలో కోత విధించేందుకు కంపెనీ గ్రీన్ సిగ్నల్ తెలిపింది (ఫ్యాక్టరీ చట్టాల ప్రకారం అక్రమంగా సమ్మె చేస్తే నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేసే అధికారం యాజమాన్యానికి ఉంటుంది, ఇందులో భాగంగా సాధారణంగా ఒక రోజు సమ్మెకు గానూ ఎనిమిది రోజుల జీతాన్ని కోత విధిస్తారు).


Click it and Unblock the Notifications








