ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 800 కోట్ల నిధులు కేటాయింపు

Hero Honda Capex
భారతదేశపు నంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో హోండా మోటార్స్ లిమిటెడ్ (హెచ్‌హెచ్ఎమ్ఎల్) 2011-12 ఆర్థిక సంవత్సరానికి గానూ పెట్టుబడుల కోసం రూ. 800 కోట్ల వరకూ నిధులను కేటాయించనున్నట్లు పేర్కొంది. కంపెనీ నాలుగో ప్లాంటు ఏర్పాటుకు కావలిసిన పెట్టబడులను కూడా ఈ మొత్తం నుంచే వెచ్చించనున్నట్లు హీరో హోండా తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం విక్రయాలు 60 లక్షలను తాకవచ్చునని కంపెనీ అంచనా వేస్తోంది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో హీరో హోండా మొత్తం 54 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. "ఈ ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్ (పెట్టుబడి) దాదాపు రూ. 600-800 కోట్లు, ఇందులో మెజారిటీ మొత్తాన్ని నాలుగో ప్లాంటు ఏర్పాటుకు వెచ్చిస్తామ"ని హెచ్‌హెచ్ఎమ్ఎల్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రవి సుద్ వెల్లడించారు.

కొత్త ప్లాంటుపై వెచ్చించే పెట్టుబడులు ఎక్కువగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే వస్తాయని ఆయన తెలిపారు. నాలుగో ప్లాంటు కోసం త్వరలోనే స్థలాన్ని ఖరారు చేస్తామని కంపెనీ తెలిపింది. ఏప్రిల్ 2011 నాటికి కంపెనీ మొత్తం ఉత్పత్తి సాలీనా 6.15 మిలియన్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఉత్పత్తి 5.4 మిలియన్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ క్యాపెక్స్ రూ. 300 కోట్లు, అయితే అందులో ఎక్కవ భాగాన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకే కంపెనీ ఉపయోగించింది.

More from DriveSpark

Article Published On: Thursday, May 5, 2011, 14:55 [IST]
English summary
India's largest two-wheeler maker Hero Honda Motors Ltd said it has earmarked up to Rs 800 crore as capital expenditure for 2011-12 financial year that will include the cost for setting up its fourth plant. The company also said it expects sales to touch a total of 6 million units during this fiscal, up from 5.4 million units it had clocked in 2010-11.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+