స్కూటర్ల ఉత్పత్తిని రెట్టింపు చేయనున్న హీరో మోటోకార్ప్

Hero Scooter
భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) స్కూటర్ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలని యోచిస్తుంది. స్కూటర్ల ఉత్పత్తిని పెంచుకోవడం ద్వారా 25 దేశీయ మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. అన్ని ప్లాంట్ల ద్వారా 64 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్న హీరో మోటోకార్ప్ ప్రతి ఏటా 6 లక్షల స్కూటర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతానికి స్కూటర్లు గుర్గావ్ ప్లాంటులో మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో హరిద్వార్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని 8,000 యూనిట్ల నుండి 9,500 యూనిట్లకు పెంచనున్నట్లు కంపెనీ సిఎఫ్ఓ రవి సూద్ వెల్లడించారు. కంపెనీ మొత్తం అమ్మకాలలో 95 శాతం బైక్‌ల ద్వారా వస్తున్నాయని, వాటిలో స్ప్లెండర్, ప్యాషన్ బ్రాండ్‌లే అధికంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

గడచిన ఆగస్టు నెలలో లండన్‌లో తమ బ్రాండ్ లోగో ఆవిష్కరణ సందర్భంగా విడుదల చేసిన 110 సీసీ స్కూటర్ మాస్ట్రోను త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నామని, ఇప్పటికే 150సీసీ డ్యూయెల్ పర్సప్ మోటార్‌సైకిల్ ఇంపల్స్‌ను విడుదల చేశామని కంపెనీ వివరించింది. భారత మార్కెట్లో హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్ ధర రూ.66,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 20, 2011, 17:34 [IST]
English summary
The world's largest two-wheeler maker, Hero MotoCorp (formerly known as Hero Honda)is planning to double its production of scooters to grab a 25% share in the domestic market, a company official stated.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+