అధిక పెట్రోల్ ధరలు: ఊపందుకున్న డీజిల్ కార్ల విక్రయాలు.!!

Chevy Diesel
పెట్రోల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమనడంతో డీజిల్ కార్ల ధరలు ఊపందుకున్నాయి. మే 14వ తేదీన చమురు కంపెనీలు పెట్రోల్ ధరలను ఇదివరకెన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా లీటరు పెట్రోల్‌పై రూ. 5 మేర ధరను పెంచడంతో డీజిల్ కార్లపై మక్కువ చూపే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాది జూన్ నెలలో పెట్రోల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణలను ఎత్తివేయడంతో, దీని ధరలపై ఆధిపత్యం చమురు కంపెనీల చేతికి వచ్చింది. దీంతో చమురు సంస్థలు నష్టాల్లో ఉన్నామంటూ.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఒక్కసారిగా పెట్రో ధరలను భగ్గుమనిపించి, వినియోగదారుల జేబులకు మంట పెట్టాయి.

ఈ నేపథ్యంలో కొత్త కారు కొనాలనుకునే వారు పెట్రోల్ వేరియంట్‌కు బదులు డీజిల్ వేరియంట్‌ను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా పెట్రోల్ వేరియంట్ కారుతో పోలిస్తే డీజిల్ వేరియంట్ కారు సుమారు రూ. 75,000 నుంచి లక్షల రూపాయల వరకూ ధర అధికంగా ఉంటుంది. అయినా సరే.. అధిక ధర విషయాన్ని పక్కనపెట్టి మరీ డీజిల్ కార్ల వైపే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెట్రోల్ కారును ఉపయోగిస్తున్న కొంత మంది వినియోగదారులు కూడా తమ పెట్రోల్ కారును గ్యారేజ్‌లో ఉంచేసి కొత్త డీజిల్ కారు కోసం పరుగులు తీస్తున్నారు. ఫలితంగా పెట్రోల్ కార్లకు డిమాండు తగ్గి డీజిల్ కార్లకు డిమాండ్ ఊపందుకుంది.

సాధారణం అన్ని మేజర్ మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర దాదాపు 60 నుంచి 70 శాతం వరకూ చౌకగా ఉంటుంది. ఇటీవల డీజిల్ ధరల పెంపుపై జరిగిన మంత్రుల ప్రాధికారిక సమావేశంలో ప్రభుత్వం ధరలను పెంచకపోవడం డీజిల్ కార్లు కొనాలనుకే వారికి మరియు తయారీదారులకు కూడా శుభావార్తనే చెప్పాలి. దీని ఫలితంగా రానున్న రెండేళ్లలో డీజిల్ కార్ల విక్రయాలు 40 శాతం వరకూ పెరగవచ్చునని ఆటోమోటివ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డీజిల్ ధరలపై ప్రభుత్వం నియంత్రణలను కొనసాగించినంత వరకూ ఎలాంటి సమస్య ఉండబోదని, ఒకవేళ దీని ధరల ఆధిపత్యం కూడా పెట్రోల్ ధరల మాదిరిగానే చమురు కంపెనీల చేతికి వెళ్తే ఇటు సామాన్యూడికి, అటు ఆటో కంపెనీలకు ధరాఘాతం తప్పదని ఆటోమొబైల్ పరిశ్రమ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, May 23, 2011, 17:39 [IST]
English summary
Considering the high raise in petrol prices, new car buyers are choosing Diesel cars, even if it more higher than a Petrol car. Which results that the demand of diesel cars surges rapidly, and also now diesel is about 60% and 70% cheaper than petrol in all the major metros.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+