అక్టోబర్ నాటికి పంజాబ్‌లో హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు

కొత్త వాహనాలకు అలాగే, పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌ను తప్పనిసరి చేస్తూ పంజాబ్ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అన్ని కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు రానున్నాయి. అలాగే, పాత వాహనాలను ఉపయోగిస్తున్న వారు, తమ పాత నెంబర్ ప్లేట్ స్థానంలో కొత్త హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌ను అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు రెండేళ్ల సమయాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది.

ఈ విషయంలో ఇప్పటికే తొమ్మిది కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బిడ్‌లను కూడా అందుకోవడం జరిగింది. ఒక్కసారి బిడ్డర్‌ను ఎన్నుకున్న తర్వాత, ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది అనంతరం బిడ్డర్ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌లకు సంబంధించి పనులను ప్రారంభించడం జరుగుతుంది. ఈ తంతు మొత్తం పూర్తవుడానికి రెండు నెలల సమయం పడుతుంది. అంటే అక్టోబర్ నెల నాటికి హె సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌లు ప్రవేశపెట్టబడతాయి.

రిజిస్ట్రేషన్ ప్లేట్స్ లేదా స్టిక్కర్లను రిజిస్ట్రేషన్ అథారిటీ లేదా ఏదైనా అధీకృత ప్రాంతం వద్ద మాత్రమే అమర్చడం లేదా అతికించడం జరుగుతుంది. పాత వాహనాల నుంచి తొలగించిన నెంబర్ ప్లేట్లను రిజిస్ట్రేటింగ్ అథారిటీ అధీనంలో ఉంచడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అథారిటీ (ఆర్టీఓ) నుంచి ఆథరైజేషన్ లభించిన నాలుగు పని దినాలలోగా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌లను అమర్చుకోవాల్సి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 15, 2011, 17:07 [IST]
English summary
In Punjab, High Security Number Plates for new vehicles will become mandatory likely from October. In this regard, the state government has received bids from nine companies. Old vehicle owners also need to replace their number plan with high security number plate. For this change Govt. will be given two years time to shift to high security number plates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+