మొన్న ఇంధనం, నిన్న వడ్డీ ధరలు, నేడు రోడ్డు పన్నులు..!!

Road Tax
ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలు, రుణాల పై నానాటికి వడ్డీ ధరలతో కంపెనీలు, వినియోగదారులు సమతమతవుతుంటే.. తాజాగా రోడ్డు పన్నులను కూడా పెంచడం పట్ల అటు ప్రజలు, ఇటు ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు టాక్స్‌లను భారీగా పెంచడం పట్ల దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఇండియా (ఎమ్ఎస్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా రోడ్డు పన్నులను పెంచడం వల్ల తమ విక్రయాలు నిలిచిపోయాయని కంపెనీ పేర్కొంది. దేశంలోని తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ వంటి పలు రాష్ట్రాలు వాహన రిజిస్ట్రేషన్, రోడ్డు పన్ను విధానాలను సవరించిన సంగతి తెలిసిందే. పన్నుల పెంపు తమ కంపెనీ విక్రయాలపై ప్రభావం చూపిందని మారుతి సుజుకి ఇండియా ఛీఫ్ జనరల్ మేనేజర్ చెప్పారు.

ఇప్పటికే ఛండీఘడ్, హర్యానా రాష్ట్రాలలో సవరించిన పన్ను విధానాన్ని గత నెలలో అమలుచేయడం జరిగింది. పంజాబ్ కూడా త్వరలోనే కొత్త పన్ను విధానాన్ని అమలుచేయనుంది. ప్రస్తుతం ఛండీఘడ్‌లో అమలులో ఉన్న పన్ను విధానం ప్రకారం.. రూ. 6 లక్షలు విలువ కలిగిన కార్లపై 2 శాతం పన్నును, రూ. 6-20 లక్షలు ఖరీదు చేసే కార్లపై 3 శాతం, రూ. 20 లక్షలు ఆపై వెల కలిగిన కార్లపై 4 శాతం పన్నులను వసూలు చేస్తుంది.

అదే హర్యానాలో రూ. 5 లక్షలలోపు విలువు కలిగిన కార్లపై 2 శాతం, రూ. 5-10 పది లక్షలు విలువ కలిగిన కార్లపై 4 శాతం, రూ. 10-20 విలువ కలిగిన కార్లపై 6 శాతం, రూ. 20 లక్షలు ఆపై విలువ కలిగిన కార్లపై 8 శాతం చొప్పున పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. మారుతి సుజుకికి ఈ రెండు రాష్ట్రాలు అత్యంత కీలకమైన మార్కెట్లు, ఇక్కడ ప్రతినెలా కంపెనీ 8,000 కార్లకు పైగా విక్రయిస్తుంది. కంపెనీ మొత్తం నికర అమ్మకాలలో ఇది 9 శాతం.

More from DriveSpark

Article Published On: Friday, February 4, 2011, 12:10 [IST]
English summary
The top most passenger car maker in India, Maruti Suzuki expressed concerns over the increase in road taxes which may block the sales. The tax systems for registration and road have since been revised by many state governments like Tamilnadu, Karnataka and Delhi in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+