హిందుస్థాన్ మోటార్స్ నుంచి ఐదు కొత్త వాహనాలు!

గడచిన ఆర్థిక సంవత్సరంలో హిందూస్థాన్ మోటార్స్ మొత్తం దాదాపు 10,000 యూనిట్లను విక్రయించింది. ఇప్పుడు తమ దృష్టంతా ఎక్కువగా వాణిజ్య వాహన విభాగంపైనే ఉందని, ప్రస్తుతం ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాల నిష్పత్తి 80:20గా ఉందని, మరో రెండేళ్ల వ్యవధిలో ఈ నిష్పత్తిని 50:50 తీసుకురావాలని భావిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐదు వాహనాలను విడుదల చేస్తామని ఝా చెప్పారు. మూడో త్రైమాసికం నాటికి ఓ సెవన్-సీటర్ అవుట్‌లాండర్ వాహనాన్ని చెన్నయ్ ప్లాంట్ నుంచి విడుదల చేస్తామని, అంతేకాకుండా.. ఓ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)ను కూడా అభివృద్ధి చేస్తున్నామని వచ్చే ఏడాది జనవరిలో ఇది విడుదల కావచ్చునని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








