కొత్త మోడళ్ల విడుదలకు శ్రీకారం చుట్టిన హిందుస్థాన్ మోటార్స్

Ambassador
సికె బిర్లా నియంత్రణలో ఉన్న ఆటోమొబైల్ దిగ్గజం హిందూస్థాన్ మోటార్స్ త్వరలో కొత్త వాణిజ్య వాహనాలను విడుదల చేసే ప్రయత్నాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీలో ఉన్న తన ఉత్తర్‌పరా ప్లాంటు నుంచి రోడ్‌షోలను ప్రారంభించింది. అంతేకాకుండా ప్రస్తుతం హిందూస్థాన్ మోటార్స్ అందిస్తున్న మోడళ్లతో పాటుగా భవిష్యత్తులో రానున్న మోడళ్ల గురించి వినియోగదారులకు అవగాన కల్పించాలనే లక్ష్యంతో కూడా కంపెనీ ఈ రోడ్‌షలను ప్రారంభించింది.

ఈ రోడ్‌షోలో భాగంగా హిందూస్థాన్ మోటార్స్ ఐకానిక్ బ్రాండ్ అంబాసిడర్ మోడల్‌లోని వివిధ వేరియంట్లను ప్రదర్శించనున్నారు. ఇంకా.. కంపెనీ అందిస్తున్న డీజిల్ వాణిజ్య వాహనం హెచ్ఎమ్ విన్నర్ 1.5ఎక్స్‌డి ప్లస్‌ను పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిషా మరియు బీహార్‌లలో రానున్న 15 రోజుల పాటు ప్రదర్శించనుంది. అంతేకాకుండా.. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, మధ్య మరియు ఉత్తర భారతాలలో కూడా ఈ రోడ్‌షోను కొనసాగించాలని కంపెనీ భావిస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంబాసిడర్ కన్నా చిన్నదిగా అదే ఫ్లాట్‌ఫామ్‌పై కంపెనీ ఓ కారును అభివృద్ధి చేస్తోంది. ఈ కారు ద్వారా అంబాసిడర్ బ్రాండ్‌కు యధా స్థానాన్ని కల్పించాలని కంపెనీ యోచిస్తోంది. అలాగే, హిందుస్థాన్ మోటార్స్ విడుదల చేయనున్న వాణిజ్య వాహనం అంబాసిడర్ కారు డిజైన్ ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంబాసిడర్ ఫ్లాట్‌ఫామ్‌ ఆధారంగా సింగిల్ క్యాబిన్ కలిగిన ఓ చిన్నసైజు వాణిజ్య వాహనం పికప్ ట్రక్కును హెచ్‌ఎమ్ విడుదల చేయవచ్చనే పుకార్లు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, July 15, 2011, 18:37 [IST]
English summary
Hindustan Motors will soon launch new commercial vehicles and has kick-started its publicity campaign by conducting a road show from its plant in Uttarpara in West Bengal. The company also wants to publicize its current and forthcoming models.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+