అంబాసిడర్ గ్రాండ్‌ను విడుదల చేసిన హిందూస్థాన్ మోటార్స్

క్లాసిక్ కారు అంబాసిడర్ ఫ్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ వేరియంట్‌లో ఆకర్షనీయమైన సైడ్ ఇండికేటర్స్, స్పష్టమైన గ్లాస్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, బాడీ-కలర్డ్ బంపర్స్, ఫుల్ వీల్ హబ్ కవర్, సాఫ్ట్ టచ్ డోర్ హ్యాండిల్, డైమండ్ కట్ టెయిల్ ల్యాంప్స్ వంటి అదనపు సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా.. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ (ఆప్షనల్), మ్యూజిక్ సిస్టమ్, మౌల్డెడ్ డోర్ ప్యాడ్, మొబైల్ చార్జర్, మల్టీ-ట్రిప్ ఆప్షన్‌తో కూడిన డిజిటల్ ట్రిప్ మీటర్, మాల్‌ఫంక్షన్ ఇండికేటర్ చెక్ లైట్ వంటి ఆకర్షనీమ ఫీచర్లు కూడా ఇందులో పొందుపరడబడ్డాయి.
ఇందులో మరో విశేషం ఏంటంటే.. అంబాసిడర్ గ్రాండ్ 50,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది. ఇక దీని శక్తి సామర్థ్యాల విషయానికి వస్తే.. 1,817 పెట్రోల్ ఇంజన్‌తో 71 బిహెచ్‌పి @ 4,800 ఆర్‌పిఎమ్ గరిష్ట శక్తిని, 13.7 కెజిఎమ్ @ 2,250 ఆర్‌పిఎమ్ గరిష్ట టార్క్‌లో పనిచేస్తుంది. ఇది ఆరు విభిన్న రంగులలో లభ్యమవుతుంది. జెట్ బ్లాక్, లూనార్ సిల్వర్, ఫైర్ బ్రిక్ రెడ్, ఓయ్‌స్చర్ బ్లూ, ఈక్రూ బీగి, క్రిస్టల్ వైట్ రంగులలో ఇది లభిస్తుంది. అంబాసిడర్‌ను ఆధారంగా చేసుకొని ఈ ఏడాదిలో ఓ చిన్నకారును కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది.


Click it and Unblock the Notifications








