హెచ్ఎమ్ నుంచి అంబాసిడర్ ఫ్లాట్‌ఫామ్‌పై 'వీర్'

వీర్ వాణిజ్య వాహనాన్ని పూర్తిగా అంబాసిడర్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించారు. అందుకే ఈ వాహనం ముందుభాగం చూడటానికి పూర్తిగా అంబాసిడర్ కారు మాదిరగానే ఉంటుంది. డిజైన్ ఒకేలా ఉన్నప్పటికీ, ఎక్కువ పేలోడ్ కోసం దీని ట్రాన్సిమిషన్ మరియు సస్పెన్షన్ సిస్టమ్‌లలో మార్పులు చేర్పులు చేశారు. ఈ వాహణం డీజిల్ (BS III) మరియు సిఎన్‌జీ (BS IV) వెర్షన్లలో వీర్, వీర్ ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభ్యం అవుతుంది. దీని ఫ్రంట్ క్యాబిన్ ఓ వాణిజ్య వాహనాన్ని నడుపుతున్న అనుభూతిని కాకుండా పూర్తిగా అంబాసిడర్ కారును నడుపుతున్న అనుభూతిని కల్పించడం విశేషం. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 3.30 లక్షలు (ఎక్స్-షోరూమ్ కలక్తతా)గా ఉంది. మరి మన పాత అంబాసిడర్ కొత్త అవతారం బావుందా..!?


Click it and Unblock the Notifications








