కార్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో సామాజిక అభివృద్ధి

ఈ సందర్భంగా, తమిళనాడులోని వివిధ జిల్లాలో గ్రామాల యొక్క పారిశుధ్య పరిస్థితులను మరియు జీవన ప్రమాణాలను పెంచడంలో పనిచేస్తున్న 120 మంది కొరియన్ హ్యాపీ మూవ్ 7వ బ్యాచ్ వాలంటీర్లను కూడా హెచ్ఎమ్ఐఎఫ్ స్వాగతించింది. విద్యాపరమైన ప్రాజెక్టులకు తమ మద్దతుగా ఈ ఫౌండేషన్ వివిధ అభివృద్ధి పనులను చేపట్టనుంది. వాటిలో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యార్థం 450 సెట్‌ల బెంచ్‌లు మరియు 50 పాఠశాలలోని ఉపాధ్యాయుల కోసం 200 టేబుళ్లు, కుర్చీలను ఈ హెచ్ఎమ్ఐఎఫ్ దానం చేయనుంది.
అంతేకాకుండా.. మధ్యతరగతి పాఠశాలలో బోర్ వెల్స్ ఏర్పాటు, కంపెనీ ఒకేషన్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన 50 మంది తొలి గ్రాడ్యూయేట్ బ్యాచ్ నర్సింగ్ విద్యార్థులకు సర్టిఫికెట్‌ల పంపిణీ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టనుంది. ఈ సందర్భంగా, హెచ్ఎమ్ఐఎఫ్ ట్రస్టీ ఆర్. సేతురామన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులకు అవసరమయ్యే సొమ్మును తమ కార్ల అమ్మకాల ద్వారా సేకరిస్తున్నామని, భవిష్యత్తులో తమ వినియోగాదారులను కూడా ఈ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వాములుగా చేస్తామని తెలిపారు.


Click it and Unblock the Notifications








