విడిభాగాల కొరత.. హోండా కార్ల డెలివరీ ఆలస్యం..

హోండాకు విడిభాగాలను సరఫరా చేయడంలో థాయ్‌లాండ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ప్రస్తుతం థాయ్‌లాండ్‌ను వరదలు పూర్తిగా ముంచెత్తుతుండటంతో విడిభాగాల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో హోండా విడిభాగాల కోసం చైనా, జపాన్ దేశాలను ఆశ్రయిస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే బుకింగ్ చేసుకున్న హోండా కార్ల డెలివరీల ఆలస్యం గురించి హోండా తమ వినియోగదారులకు సమాచారం అందించే పనిలో ఉంది.
ప్రస్తుతం హోండాకు 6,000 బ్రయో కార్లు, 4,000 జాజ్ కార్లు బుకింగ్ అర్డర్లు పెండిగ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకూ హోండా కేవలం 1,000 బ్రయో కార్లను మాత్రమే డెలివరీ చేసింది. అయితే, నిర్ణీత సమయంలో డెలివరీ చేయడంలో హోండా ఇబ్బందులు ఎదుర్కుంటుంది. థాయ్‌లాండ్ వరదల కారణంగా దాదాపు అన్ని మోడళ్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది.
తమ వాహనాలకు మంచి డిమాండ్ ఉందని, ఈ పరిస్థితుల్లో ఉత్పత్తిని నిలిపివేయలేమని, ఎలాగైనా ఉత్పత్తిని సాగిస్తామని హోండా పేర్కొంది. కాగా.. మరోవైపు హోండా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హోండా జాజ్ బుకింగ్‌లను కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తతం హోండా జాజ్ వెయిటింగ్ పీరియడ్ సుమారు ఆరు నెలల వరకూ ఉంటోంది.


Click it and Unblock the Notifications








