హోండా చవక కారు బ్రయో లాంచ్ లైవ్‌లో వీక్షించండి..

 Honda Brio Launch
హోండా చిన్న కారు 'బ్రయో' ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న కార్ ప్రియుల కల నేటితో నిజం కానుంది. జపాన్ ఆటో దిగ్గజం రూపొందించిన తొలి చవక కారు బ్రయోను సెప్టెంబర్ 27న కంపెనీ అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే, ఈ కారు ఇప్పటికే మలేషియా రోడ్లపై పరుగులు కూడా తీస్తుంది. జపాన్ సునామీ తర్వాత ఏర్పడిన వివిధ పరిస్థితుల కారణంగా కంపెనీ ఈ మోడల్ విడుదల వాయిదా వేస్తూ వచ్చింది.

బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు బ్రయో కారును కంపెనీ భారత్‌లో విడుదల చేయనుంది. ఈ కారు లాంచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కంపెనీ వెసలుబాటును కూడా కల్పించింది. బ్రయో లాంచ్‌ను లైవ్‌లో చూడాలంటే హోండా ఫేస్‌బుక్ పేజ్‌ను కానీ లేదా ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌పేజ్‌ను కానీ సందర్శించవచ్చు. పాఠకుల సౌకర్యం కోసం ఈ రెండు లింకులను కింద ఇవ్వడం జరిగింది.

Facebook

Webcast Live

ప్రస్తుతం భారత్‌లో హోండాకు ఉన్న ఒకే ఒక చిన్న కారు హోండా జాజ్ మాత్రమే. కాగా.. తాజాగా విడుదల చేయనున్న చిన్న కారు 'బ్రయో' అటు ధరలోనూ, ఇటు పరిమాణంలో జాజ్ కన్నా దిగువన ఉండేలా కంపెనీ విడుదల చేయనుంది. దీని ధర మూడు లక్షలకు ఎగువన ఉండొచ్చని అంచనా. బ్రయో చిన్న కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలోనే మా పాఠకులతో పంచుకుంటాం. ఈ చిన్న కారుకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం వన్ఇండియా ఆటోమొబైల్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 27, 2011, 11:32 [IST]
English summary
Honda Siel India Cars is all set to launch the new Brio hatchback today. The diminutive hatchback which was scheduled to be launched in India much earlier was delayed due to the destructive earthquake and Tsunami that struck Japan. Honda had already launched the Brio in Malaysia.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+