రూపురేఖలు మారనున్న 'హోండా సిటీ': పండుగ సీజన్‌లో విడుదల

అంతేకాకుండా.. గత మార్చి-ఏప్రిల్ నెల విక్రయాలలో హోండా సిటీ సెడాన్‌ను జర్మనీకు చెందిన ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఓవర్‌టేక్ చేసింది. గడచిన మార్చి-ఏప్రిల్ నెలలో ఫోక్స్‌వ్యాగన్ మొత్తం 6,839 వెంటో కార్లను విక్రయిస్తే.. హోండా మాత్రం కేవలం 4,315 సిటీ కార్లను మాత్రమే విక్రయించింది. ఈ నేపథ్యంలో హోండా సిటీ తన యథాస్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు కంపెనీ ఈ మోడల్‌కు మరిన్ని మెరుగులు అద్ది ఈ ఏడాది పండుగ సీజన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. సిటీ కారు లోపలివైపు మరియు బయటివైపు మరిన్ని అదనపు హంగులు చేర్చనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న సిటీ సెడాన్ ఇంటీరియర్స్ కన్నా స్పోర్టీ లుక్ ఉండే ఇంటీరియర్స్ కొత్త వెర్షన్‌లో ఉండే అవకాశం ఉంది.
కారు బంపర్ మరియు టెయిల్ ల్యాంప్స్ కూడా మారనున్నట్లు సమాచారం. అయితే ఇంజన్‌లో ఏలాంటి మార్పులు ఉండబోవు. ఇంకా ఇందులో వై-ఫై, బ్లూటూత్ వంటి సాంకేతిక మార్పులతో పాటు సన్‌రూఫ్ ఆప్షన్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాగా.. దీనిపై స్పందించేందుకు హోండా మోటార్స్ నిరాకరిస్తోంది. ప్రస్తుతం తమ దృష్టంతా చిన్న కారు బ్రయో విడుదల పైనే ఉందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications








