హోండా సివిక్ ఇప్పుడు సన్‌ రూఫ్ సదుపాయంతో కూడా..!!

Honda Civic
జపాన్‌ కు చెందిన ఆటోమొబైల్ సంస్థ హోండా మోటార్ కంపెనీ ప్రవేశపెట్టిన "హోండా సివిక్"లో కొత్తగా సన్‌ రూఫ్‌ (సూర్యకాంతి, గాలి కారు లోపలికి ప్రసరించే విధంగా కారు పైభాగంలో ఏర్పాటు చేయబడి ఉండే నల్లటి అద్దం) ఉండే మోడల్‌ను ప్రవేశపెట్టింది. అర్బన్ టైటానియంతో చేయబడిన సన్‌రూఫ్ కలిగి ఉండే ఈ సెడాన్ రెండు వెర్షన్లలో లభిస్తుంది. మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో కూడిన హోండా సివిక్ ధరను రూ. 13.53 లక్షలు గానూ..ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ కలిగిన హోండా సివిక్ ధరను రూ. 14.27 లక్షలు గానూ కంపెనీ నిర్ణయించింది.

ఈ కారును కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్)లు విడుదల చేశారు. హోండా సివిక్‌కు సన్‌రూఫ్‌ను ఏర్పాటు చేయడం వల్ల కారుకు కొత్త రూపం వచ్చిందని, సివిక్ వినియోగదారులు ఇచ్చిన సలహాల మేరకు ఈ కారుకు రూపకల్పన చేశామని కంపెనీ డైరెక్టర్ చెప్పారు. గత 2006లో విడుదలైన హోండా సివిక్ ఇప్పటి వరకూ దాదాపు ఐదు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

కాగా..కొత్తగా విడుదల చేసిన సన్‌రూఫ్ హోండా సివిక్‌ 1.8 లీటర్ సామర్థ్యం గల అత్యాధునిక ఐ-వీటీఈసీ ఇంజన్‌ పరిజ్ఞానంతో రూపొందించబడింది. ఇది లీటరుకు 15.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో ఇంటెలిజెంట్ వేరియబిల్ వాల్యూ టైమింగ్ అండ్ లిఫ్ట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ (ఐ-వీటీఈసీ), వేరియబిల్ టైమ్ కంట్రోల్ (వీటీసీ) అనే రెండు సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించబడ్డాయి. ఈ రెండు కూడా ఇంధన సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడుతాయని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Friday, January 21, 2011, 8:56 [IST]
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+