ఎయిర్‌బ్యాగ్ సమస్య: 3 లక్షలకు పైగా అకార్డ్, సివిక్ రీకాల్

ఈ రెండు మోడళ్ల కూడా హోండా నుండి అధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం సెడాన్ కార్లు. రీకాల్ చేసిన కార్లలో హోండా ఒడిస్సీ మినీ-వ్యాన్‌లు కూడా ఉన్నాయి. ఈ రీకాల్‌లో ఎక్కువ భాగం కార్లు అమెరికాలో విక్రయించినవే. గడచిన మూడేళ్లలో హోండా నుంచి ఇది ఆరవ రీకాల్. 2001-2002 మధ్య కాలంలో తయారైన 3,04,035 వాహనాలు ఈ రీకాల్‌కు వర్తించనున్నాయి.
ఇందులో 273,000 వాహనాలు ఒక్క అమెరికాలో రీకాల్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్, సింగపూర్ దేశాలలో కూడా ఈ మోడళ్లను రీకాల్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, భారత్‌లో అమ్ముడైన కార్లు మాత్రం ఈ రీకాల్‌కు వర్తించవు.


Click it and Unblock the Notifications








