భారత్‌లో స్థిరత్వం కోసం సన్నాహాలు ప్రారంభించిన హోండా

Honda CBR250R
హీరో హోండా మోటార్ కంపెనీ జాయింట్ వెంచర్ నుంచి జపాన్‌కు చెందిన హోండా మోటార్ కంపెనీ విడిపోనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో తామే స్వతహాగా వ్యాపారం చేయాలని హోండా భావిస్తుంది. ఇందుకోసం భారత మార్కెట్‌కు అనుగుణంగా ఉండేవిధంగా హోండా సరికొత్త మోడళ్లను రూపొందిస్తుంది. అంతే కాకుండా.. హోండా మోటార్ కంపెనీ పూర్తి అనుబంధ సంస్థ అయిన "హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా" (హెచ్‌ఎమ్ఎస్ఐ) డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించనుమది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి బైక్ లవర్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 250 సీసీ స్పోర్ట్స్ బైక్ "హోండా సీబీఆర్250ఆర్"ను విక్రయించనుంది. దీని ధర 1.5 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.

భారత వినియోగదారుల అభిరుచులు, అవసరాల మేరకు అన్నిరకాల మోడళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను, మోడళ్ల విడుదలకు సంబంధించిన కాలపరిమితిని కాని ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం హోండా కంపెనీ నుంచి ఆక్టివా, డియో వంటి స్కూటర్లు, స్టన్నర్, షైన్, ట్విస్టర్, యునికార్న్ వంటి మోటార్‌సైకిళ్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎమ్ఎస్ఐకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 790 అవుట్‌లెట్లు (2398 డీలర్లు, 392 శాఖలు), 389 ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి.

హై-ఎండ్ బైక్‌ల విభాగంలో తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు హోండా సీబీఆర్250ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ స్పోర్ట్స్ బైక్‌కు జనవరి ఒకటి నుంచి ప్రపంచవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభించామని, బుకింగ్‌లు ప్రారంభించిన ఒక్క నెలకే 1,800 యూనిట్ల ఆర్డర్లు వచ్చాయని కంపెనీ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం భారత మార్కెట్లో కంపెనీ 26 శాతం వృద్ధిని సాధించాలని భావిస్తోంది. 2010-11 సంవత్సరానికి కంపెనీ 16 లక్షల యూనిట్లను విక్రయించాలనే లక్ష్యంతో ఉంది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 12.7 లక్షల యూనిట్లను విక్రయించింది.

'హోండా సీబీఆర్250ఆర్' ప్రత్యేకతలు..!!

ఇంజన్:
ఇంజన్ టైప్ : 4 స్ట్రోక్, డిఓహెచ్‌సి 4-వాల్వ్, వాటర్ కూల్డ్
బోర్ x స్ట్రోక్ : 76 x 55 mm
కంప్రెషర్ నిష్పత్తి : 10.7 : 1
గరిష్ట పవర్ : 26.2 బిహెచ్‌పి (18.7 కిలోవాట్స్) @8500 ఆర్‌పిఎమ్
గరిష్ట టార్క్ : 22.9ఎన్ఎమ్ @7,000 ఆర్‌పిఎమ్
ట్రాన్సిమిషన్ (గేర్లు) : ఆరు
క్లచ్ : కాయిల్ స్పింగ్‌తో కూడిన వెట్ మల్టీప్లేట్ క్లచ్

ఎలక్ట్రికల్స్:
స్టార్ట్ : ఎలక్ట్రిక్ స్టార్ట్
బ్యాటరీ : 12 వోల్ట్, 6 ఆంప్
హెడ్‌లైట్ : 55/60 వాట్స్
ఛాసిస్ : బడుల్ బీమ్ టైప్ స్టీల్ ట్యూబ్ (డైమండ్ ఫ్రేమ్)

కొలతలు:
పోడవు : 2030 mm
వెడల్పు : 709 mm
ఎత్తు : 1127 mm
వీల్‌బేస్ : 1369 mm
గ్రౌండ్ క్లియరెన్స్ : 148 mm
బరువు : 161 kgs
ముందు టైర్ : 2.7" (inch)
వెనుక టైర్ : 4" (inch)
ముందు సస్పెన్షన్ : టలిస్కోపిక్ ఫోర్క్
వెనుక సస్పెన్షన్ : ప్రో-లింక్ మోనోషాక్
ముందు బ్రేక్ : హైడ్రాలిక్ డిస్క్ 296 x 4.5 mm
వెనుక బ్రేక్ : హైడ్రాలిక్ డిస్క్ 220 x 5 mm

ధర రూ. 1.5 లక్షల నుండి ప్రారంభం.

More from DriveSpark

Article Published On: Tuesday, February 8, 2011, 13:54 [IST]
English summary
With its exit plan from Hero Honda being finalised, Japan's Honda Motor Co is gearing up to launch India specific two-wheeler models as it prepares for the solo ride here. The company's wholly-owned subsidiary, Honda Motorcycle and Scooter India (HMSI), will also expand its dealer base and strengthen vendor network to rapidly expand presence in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+