రాష్ట్రంలోని హోండా కార్ ప్రియులకు ఓ శుభవార్త. భారత్‌లో హోండా అందిస్తున్న మొట్టమొదటి చిన్న కారు 'హోండా బ్రయో' ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా లభ్యం కానుంది. హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ తమ తొలి చిన్న కారు బ్రయోను మంగళవారం రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఉపయోగించిన 1200 సీసీ ఇంజన్ పెట్రోల్ (1.2 లీటర్ ఐ-విటెక్) ఇంజన్‌ను కలిగి ఉండి, 88 బిహెచ్‌పిల శక్తిని, 109 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
లీటరుకు 18.4 కి.మీ. మైలేజీనిచ్చే హోండా బ్రయో కారు ధరు రాష్ట్ర మార్కెట్లో కింది విధంగా ఉన్నాయి.
* హోండా బ్రయో ఈ - రూ.4.04 లక్షలు
* హోండా బ్రయో ఎస్ - రూ.4.44 లక్షలు
* హోండా బ్రయో ఎస్ ఆప్షన్ - రూ.4.99 లక్షలు
* హోండా బ్రయో వీ - రూ.5.19 లక్షలు