భారత మార్కెటే ఫస్ట్, మిగతావన్నీ నెక్స్ట్: హోండా

ఈ సందర్భంగా హోండా సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ దృష్టంతా ప్రధానంగా దేశీయ మార్కెట్ పైనే కేంద్రీకరించామని, తర్వాతి కాలంలో నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ మరియు శ్రీలంక దేశాలకు భారత్‌లో తయారైన కార్లను ఎగుమతి చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం హోండా రాజస్థాన్‌లోని ప్లాంటు నుండి విడిభాగాలను, ఇంజన్ భాగాలను ఎగుమతి చేస్తోందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.112 కోట్ల టర్నోవర్‌ను సాధించగలమని భావిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో హోండాకు 83 నగరాల్లో 135 డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వీటి సంఖ్యను 143 పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. బ్రయో విడుదలైన ప్రతి నగరంలోనూ ఈ మోడల్‌కు అపూర్వ స్పందన వస్తోందని, బ్రయో విడుదలైన పది రోజుల్లోనే 2,000 ఎంక్వైరీలు వచ్చాయని సేన్ తెలిపారు.
బ్రయో చిన్న కారు గ్రేటర్ నోయిడాలోని హోండా ఉత్పత్తి కేంద్రంలో 80 శాతానికి పైగా లోకలైజేషన్‌తో తయారవుతుంది. ఆరు రంగుల్లో లభించే హోండా బ్రయో ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి.
* హోండా బ్రయో ఈఎమ్‌టి - 3.99 లక్షలు
* హోండా బ్రయో ఎస్ఎమ్‌టి - 4.40 లక్షలు
* హోండా బ్రయో ఎస్(ఓ)ఎమ్‌టి - 4.98 లక్షలు
* హోండా బ్రయో విఎమ్‌టి - 5.21 లక్షలు


Click it and Unblock the Notifications








