అప్‌గ్రేడెడ్ లగ్జరీ సెడాన్ 'అకార్డ్'ను విడుదల చేసిన హోండా

భారత్‌లో అకార్డ్ విడుదలైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ 25,000 కార్లకు పైగా అమ్ముడయినట్లు ఆయన తెలిపారు. మే, 2008లో ఎనిమిదవ తరం అకార్డ్‌ను 2.4 లీటర్, 3.5 లీటర్ ఇంజన్‌ల సామర్థ్యంతో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. కొత్తగా విడుదల చేసిన అకార్డ్ ఇదివరకు లేనివిధంగా అధిక స్టైల్, అధిక సౌకర్యం, అధిక సదుపాయాలతో లభిస్తుందని, భారతీయ రహదారులకు అనుగుణంగా ఈ కారును తీర్చిదిద్దామని కంపెనీ పేర్కొంది. ఇకపోతే ఇది కూడా 2.4 లీటర్, 3.5 లీటర్ ఇంజన్ సదుపాయాలతో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. 2.4 లీటర్ ఇంజన్ అకార్డ్ ధర రూ. 19.60-20.36 లక్షల మధ్య ఉండగా, 3.5 లీటర్ ఇంజన్ అకార్డ్ ధర 25.41 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications








