సరికొత్త 'జాజ్' హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన హోండా

గడచిన 2009లో విడుదలైన హోండా జాజ్ ధరలు రూ. 7.12 లక్షల నుంచి రూ. 7.56 లక్షల మధ్యలో ఉండేవి. దీని అధిక ధరల కారణంగా ఇది మార్కెట్లో పెద్దగా రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో కొత్త జాజ్‌ను హోండా తక్కువ ధరకే అందిచాలనే ఉద్దేశ్యంతో ఈ మోడల్‌ను ప్రవేశపెట్టింది. పాత మోడల్ జాజ్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీ ఆ మోడల్‌పై కంపెనీ రూ. 75,000 వరకూ డిస్కౌంట్లను కూడా ప్రకటించింది.
తాజాగా మార్కెట్లోకి ప్రవేశించిన మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్, హ్యుందాయ్ ఐ20, ఫోక్స్‌వ్యాగన్ పోలో, స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు కొత్త హోండా జాజ్ మంచి పోటీ ఇవ్వనుంది. హోండా కొత్త జాజ్ హ్యాచ్‌బ్యాక్ గురించిన తాజా సమాచారం కోసం వన్ఇండియా ఆటోమొబైల్స్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








