జపాన్ సునామీ ప్రభావం: మే వరకూ హోండా ఉత్పత్తి కష్టమే

Honda
ఇటీవల జపాన్‌లో సంభవించిన పెను భూకంపం, సునామీల తర్వాత ఆ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చాలా సమయం పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ ప్రాంతాలలో ఉత్పత్తిని పునఃప్రారంభిస్తుంటే.. మరికొన్ని కంపెనీలు మాత్రం జపాన్‌లో పరిస్థితి పూర్తిగా కుదుటపడే వరకూ వేచి ఉండాలని భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్స్ కార్పోరేషన్ మే నెల వరకూ ఉత్పత్తి జోలికి వెళ్లకపోవచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. హోండా మాత్రమే కాకుండా.. టొయోటా, సుజుకి, నిస్సాన్ కంపెనీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా డీలర్లు వెల్లడించారు. అయితే టొయోటా, నిస్సాన్ కంపెనీలు మాత్రం ఇప్పటికే పాక్షికంగా ఫ్యాక్టరీ పనులను ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపట్టడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

కార్మిక కొరత, విడిభాగాలు, విద్యుత్ సరఫరాలలో అంతరాయాల కారణంగా ఇప్పటికే కంపెనీలు నానా అవస్థలు పడుతున్నాయి. హోండాకు చెందిన అమెరికా విభాగం 'హోండా అమెరికా' ఈ విషయంలో ఇప్పటికే డీలర్లకు మెమోలను కూడా జారీ చేసింది. అమెరికాలో ప్రతి డీలర్ల నుంచి స్టాక్ సమాచారాన్ని కంపెనీ సేకరిస్తుంది. వాహనాలను తమ వద్ద అట్టిపెట్టుకోకుండా.. మే లోపు ఉన్న స్టాక్‌ను క్లియర్ చేయాల్సిందిగా కంపెనీ డీలర్లను సూచించింది.

More from DriveSpark

Article Published On: Saturday, March 19, 2011, 17:05 [IST]
English summary
The effect of the recent outbreak of earthquake and tsunami has made Honda Motor to put off the resumption of production till May. The news has been conveyed to the US dealers that Honda is not the only company to make such a move.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+