తక్కువ ధరకే హోండా చిన్నకారు బ్రియో..: మార్చిలో విడుదల..?

Honda Brio
జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్ కంపెనీ తొలిసారిగా భారత మార్కెట్లో ఓ చిన్నకారును ప్రవేశపెట్టడానికి సన్నాహాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటి వరకూ ప్రిమీయం, హైఎండ్ వేరియంట్లను అందిస్తున్న కంపెనీ మొట్టమొదటి సారిగా భారత్‌లో ఓ చవక కారును విడుదల చేయనుంది. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ఆటో షోలో హోండా మోటార్ కంపెనీ తమ కాన్సెప్ట్ కారు "బ్రియో"ను పరిచయం చేసింది. వాస్తవానికి బ్రియో ఈ ఏడాది చివరి భాగంలో విడుదల కావాల్సి ఉంది.

అయితే.. ప్రస్తుతం భారత వినియోగదారుల కన్ను చిన్నకార్లపై ఉండటంతో ఆ అవకాశాలను వేగంగా అందిపుచ్చుకునేందుకు హోండా తొందరపడుతున్నట్లుంది. మరోవైపు జపాన్‌కు చెందిన మరో ఆటోమొబైల్ దిగ్గజం టొయోటా కూడా ఈ నెలలో మరో చిన్నకారు ఎతియోస్ లీవాను విడుదల చేయనుంది. దీంతో టొయోటా కన్నా ముందు తామే చిన్నకారును ప్రవేశపెట్టాలని హోండా భావిస్తున్నట్లు తెలుస్తుంది.

భారత్‌లోని సియోల్ గ్రూపుతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి కార్యకలాపాలను కొనసాగిస్తున్న హోండా కంపెనీ నిర్ణయించిన దాని ప్రకారం.. సెప్టెంబర్ 2011లో ఈ బ్రియో కారును దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే పూర్తిగా భారతీయ పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ కారును ఈ నెల(మార్చి, 2011)లోనే విడుదల చేయనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. భారత కార్ మార్కెట్రో హోండా బ్రియో ధర రూ.4 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఉండేలా కంపెనీ చర్యలు తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ కారుకు సంబంధించిన 80 శాతం విడిభాగాలు కూడా భారత్‌లోనే తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 1, 2011, 16:19 [IST]
English summary
Honda has been advancing the launch of its compact car Brio in the Indian market which was actually planned six months from now. The car will be launched next month much before the launch from Toyota. Honda has devised this car in actual design for the needs of the markets like India and the exact date of the launch is slated as March 17 but the customers can drive their cars only during August –September 2011.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+