టెస్ట్ డ్రైవ్ చేయకుండానే బ్రయోను బుక్ చేసేస్తున్నారు..!!

Honda Brio Bookings
'లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తా' ఇదేదో రజనీ కాంత్ సినిమాలో డైలాగ్‌లా ఉంది కదూ...! సినిమా సంగతేమో కానీ, హోండా ఇటీవల దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టిన చిన్న కారు 'బ్రయో' విషయంలో ఇది అక్షరాలా నిజమైందని చెప్పవచ్చు. చిన్న కారు ప్రియులైన భారతీయులు హోండా బ్రయోను ఎంత అద్భుతంగా ఆదరించారో చెప్పడానికి, విడుదలై అతికొద్ది రోజుల్లోనే బ్రయో సొంతం చేసుకున్న బుకింగ్‌లే స్పష్టం చేస్తున్నాయి. కొనుగోలుదారులు హోండా బ్రయో కారును టెస్ట్ డ్రైవ్ కూడా చేయకుండా బుకింగ్ చేసుకుంటున్నారంటే హోండాపై వారు ఉంచిన్న విశ్వాసాన్ని ఇది తెలియజేస్తుంది.

అలాగే, హోండా కూడా కొనుగోలుదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ధరకు తగిన విలువతో హోండా బ్రయో కారును అందిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఇప్పటికే హోండా బ్రయోకు 5,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. అవి కూడా టెస్ట్ డ్రైవ్ చేయకుండానే వచ్చిన బుకింగ్స్. ప్రస్తుతం హోండా బ్రయో ఇంకా పూర్తిస్థాయిలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాలేదు. కంపెనీ తొలుతగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో విడుదల చేసిన అనంతరం, ఇతర షోరూమ్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

బ్రయో రాకతో హోండా తన అమ్మకాలను 15 శాతం మేర పెంచుకోవాలని భావిస్తోంది. కొనుగోలుదారులు బ్రయో అంతగా ఆకర్షించడానికి ప్రధాన కారణం లుక్. క్యూట్ లుక్‌తో చూపరులను ఇట్టే కట్టిపడేయగల అందం బ్రయో సొంతం. మారుతి సుజుకి రిట్జ్, హ్యుందాయ్ ఐ10, టొయోటా ఎతియోస్, నిస్సాన్ మైక్రా వంటి కార్లకు ధీటుగా నిలువనున్న హోండా బ్రయో పెర్ఫామెన్స్‌లో శభాష్ అనిపించుకుంది. ఇందులో అమర్చిన 1.2 లీటర్ ఫోర్ పాట్ ఐవిటెక్ ఇంజన్ 6600 ఆర్‌పిఎమ్‌ల వద్ద 88 బిహెచ్‌పిల శక్తిని, 4600 ఆర్‌పిఎమ్‌ల వద్ద 119 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 15, 2011, 9:24 [IST]
English summary
Honda Siel India Cars is basking in the glory of the recently launched Brio small car. The Brio whose launch was delayed by the tsunami in Japan finally hit Indian shores in September. The new small car is Honda's latest entry level small car and is the Japanese carmaker's first car that will drive high volume sales. The Brio's sales is increasing consistently with several people expressing interest to own the Honda small car. According to recent reports, bookings of the Brio have crossed more than 5,000 units even before it has been test driven.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+