మరో 8,33,000 వాహనాలను రీకాల్ చేసిన హోండా

Honda Recall
హోండా మోటార్ కంపెనీ ఎయిర్ బ్యాగ్ సమస్య గురించి గతంలో జారీ చేసిన రీకాల్‌ను మరింత సంఖ్యలో విస్తరిస్తున్నట్లు పేర్కొంది. గతంలో రీకాల్ చేసిన హోండా, ఆక్యురా వాహనాలకు అదనంగా మరో 8,33,000 వాహనాలను రీకాల్ చేస్తున్న కంపెనీ తెలిపింది. వాహనాల్లో లోపపూరితమైన ఎయిర్ బ్యాగ్‌లను అమర్చడం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయని హోండా వెల్లడించింది. తాజాగా విస్తరించిన ఈ రీకాల్‌లో 2001, 2002 సంవత్సరానికి చెందిన అకార్డ్ మరియు సివిక్ మోడళ్లు, 2002 ఒడిస్సీ, 2002, 2003 సీఆర్-వీ, 2002, 2003 ఆక్యురా 3.2 టిఎల్, 2003 ఆక్యురా 3.2 సిఎల్ మోడళ్లు ఉన్నట్లు కంపెనీ వివరించింది.

ప్రమాదాల తర్వాత 2,430 ఫాల్టీ ఎయిర్ బ్యాగ్‌లను అమర్చామని, అయితే వాటిల్లో ఖచ్చితంగా ఏయే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయో తెలియడం లేదని, అందుకే ఈ రీకాల్ సంఖ్యను మరిన్ని వాహనాలకు వర్తించేలా చర్యలు తీసుకున్నామని కంపెనీ తెలిపింది. నవంబర్ 2008లో 4,000 కన్నా తక్కువగా 2001 అకార్డ్, సివిక్ మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్‌కు హోండా తెలిపింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2010లో దీనికి అదనంగా మరో 3,78,000 కార్లను చేర్చింది. ఎయిర్ బ్యాగ్ సమస్య కారణంగా ఆ సమయంలో 12 ప్రమాదాలు నమోదయ్యాయని, అందులో 11 మంది గాయపడ్డారని, ఒకరు మృతి చెందారని హోండా పేర్కొంది. ఈ రీకాల్‌కు సంబంధించి వాహన యజమానులకు ప్రత్యేకంగా తెలియజేనున్నామని హోండా వివరించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 4, 2011, 11:31 [IST]
English summary
Honda Motor Co expanded an earlier recall of Honda and Acura vehicles over airbags that could deploy with too much pressure, causing injuries or fatalities, the company said. The expanded recall adds more than 833,000 vehicles for the model years 2001 through 2003.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+