ట్రాన్సిమిషన్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్: 20 లక్షల హోండా కార్లు రీకాల్

Honda Recall
జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్స్ అమెరికా, చైనాలో విక్రయించిన 20 లక్షలకు పైగా కార్లను రీకాల్ చేయనుంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సాఫ్ట్‌వేర్‌ను ఈ కార్లలో ఇన్‌స్టాల్ చేసేందుకు గానూ ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా కారు చలనంలో ఉన్నప్పుడు శబ్ధ తీవ్రత తగ్గడమే కాకుండా, గేర్లను మారుస్తున్నప్పుడు కారు ఆగిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కావని హోండా తెలిపింది.

అమెరికాలో 15 లక్షల కార్లను రీకాల్ చేస్తుండగా, మిగిలిన వాటిని చైనాలో రీకాల్ చేస్తున్నట్లు హోండా తెలిపింది. 2005 నుంచి 2010 వరకూ విక్రయించిన 4-సిలిండర్ అకార్డ్ మోడళ్లు, 2007 నుంచి 2010 వరకూ విక్రయించిన సిఆర్-వీ మోడళ్లు, 2005 నుంచి 2008 వరకూ విక్రయించిన ఎలిమెంట్ మోడళ్లు, మరియు ఒడిస్సి, స్పిరియర్ మోడళ్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Japanese car major Honda Motor Co. will recall a total of 2 million vehicles sold in US and China over potential automatic transmission problems. Company said, it will update automatic transmission control software in recall affected cars.
Story first published: Saturday, August 6, 2011, 10:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X