మూడు లక్షలకు పైగా పైలట్ ఎస్‌యూవీల రీకాల్: హోండా

లింకోల్న్, అలబమాలలో 2009 నుంచి 2011 మధ్య కాలంలో తయారైన మోడళ్లలో ఈ సమస్య ఉన్నట్లుహోండా తెలిపింది. ప్రమాద సమయాల్లో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బెల్ట్‌లు హుక్ ఊడిపోయి ప్రమాద సమస్యను జఠిలం చేసే అవకాశం ఉండటంతో ఈ రీకాల్ చేస్తున్నామని, అయితే, ఈ సమస్య కారణంగా ఇప్పటి వరకూ ఎలాంటి గాయాలు కానీ మరణాలు కానీ సంభవించలేదని హోండా పేర్కొంది.
సీట్ బెల్టుల తయారీలో లోపం కారణంగా ఈ రీకాల్ చేయాల్సి వచ్చిందని, పైలట్ వాహన వినియోగదారులకు రాతపూర్వంగా ఈ రీకాల్ గురించి ప్రత్యేకంగా తెలియజేస్తామని కంపెనీ తెలిపింది. కాగా.. హోండా భారత్‌లో కూడా లోపపూరితమైన పవర్ విండోస్ స్విచ్ కారణంగా 72,115 హోండా సిటీ మిడ్-సైజ్ సెడాన్ కార్లను కంపెనీ రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








