భారత్‌లో 57,853 'హోండా సిటీ' కార్లను రీకాల్ చేసిన కంపెనీ

హోండా కంపెనీ భారత్‌లోని సియోల్ గ్రూప్‌తో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి "హోండా సియోల్ కార్స్ ఇండియా" (హెచ్ఎస్‌సిఐ) ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. మూడవ తరం (థర్డ్-జనరేషన్) 'సిటీ' మోడళ్లు, అవి కూడా నవంబర్, 2008 మరియు డిసెంబర్, 2009 మధ్య కాలం తయారు చేయబడిన హోండా సిటీ కార్లే ఈ రీకాల్‌కు వర్తిస్తాయని హెచ్ఎస్‌సిఐ వివరించింది.
ఇంజన్‌లో ఉండే లోపం కలిగిన మోషన్ స్ప్రింగ్ ఎక్కువ కాలం ఉపయోగించడం వలన వంగిపోవడం లేదా, విరిగిపోవడం జరిగి ఇంజన్ శబ్దం చేయడం జరుగుతుందని, ఫలితంగా ఇంజన్ తరచూ ఆగిపోతుండటం, రీ-స్టార్టింగ్ సమస్యలు వంటివి తలెత్తే ఆస్కారం ఉందని, అందుకే ఈ పార్ట్ స్థానంలో సరికొత్త పార్ట్‌ను బిగించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా.. ఈ స్పేర్ పార్ట్‌ను కారు యజమానులకు ఉచితంగా అందజేస్తామని, కార్ల రీకాల్ గురించి కూడా వారికి ప్రత్యేకంగా తెలియజేస్తాని కంపెనీ తెలిపింది. జనవరి, 2010లో కూడా హోండా 8,532 రెండవ తరం (సెకండ్ జనరేషన్) హోండా సిటీ కార్ల (2007లో తయారైనవి మాత్రమే)ను పవర్ విండో స్విచ్ సమస్యను సరిచేసేంతదుకు రీకాల్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








