భారత్‌లో 72 వేలకు పైగా సిటీ కార్లు రీకాల్: హోండా

రెండో తరానికి చెందిన (2005-2007లో తయారైనవి) సిటీ సెడాన్ కార్లు ఈ రీకాల్‌కు వర్తించనున్నట్లు హోండా పేర్కొంది. జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్ భారత్‌లోని సియోల్ గ్రూపుతో జాయింట్ వెంచర్‌గా ఏర్పడి హోండా సియోల్ కార్స్ ఇండియా (హెచ్ఎస్‌సిఐ) అనే పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
హోండా సిటీ సెడాన్ యజమానులకు ఈ పార్ట్‌ను ఉచితంగా రీప్లేస్ చేస్తామని, ఇందుకు సంబంధించి తమ వినియోగదారులకు ప్రత్యేకంగా సమాచారం ఇవ్వడం జరుగుతుందని కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. గతేడాది జనవరిలో కూడా హెచ్ఎస్‌సిఐ ఇలాంటిదే ఓ రీకాల్‌ను చేసింది. అప్పుట్లో 2007లో తయారైన 8,532 సిటీ కార్లను రీకాల్ చేసింది.
ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న సిటీ సెడాన్ కార్లు మూడో తరాని (థర్డ్ జనరేషన్)కి చెందినవని, తాజా రీకాల్‌కు ఈ కార్లు వర్తించవని కంపెనీ పేర్కొంది. ఈ లోపపూరిత పవర్ విండోస్ స్విచ్ కారణంగా, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 9.36 లక్షల వాహనాలు (జాజ్ హ్యాచ్‌బ్యాక్, సిటీ సెడాన్, సిఆర్-వీ ఎస్‌యూవీలు కలిపి) హోండా రీకాల్ చేస్తుంది.
ఇది గ్లోబల్ రీకాల్ మాత్రమేనని, భారత్‌లో విక్రయించిన జాజ్ మరియు సిఆర్-వీలు ఈ రీకాల్‌కు వర్తించవని, పైన తెలిపిన కాలంలో తయారైన సిటీ సెడాన్‌లు మాత్రమే ఈ తాజా రీకాల్ కిందకు వస్తాయని కంపెనీ హోండా స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications








