హోండా 2012 సిఆర్‌వి ఫోటోలను విడుదల చేసిన కంపెనీ

Honda CRV 2012
హోండా అందిస్తున్న మల్టీ పర్పస్ వాహనం (ఎమ్‌పివి) సిఆర్‌వి మోడల్‌ను రిఫ్రెష్ చేసి త్వరలోనే దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో 2012 మోడల్ హోండా సిఆర్‌వి ఫోటోలను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. కొత్త సిఆర్‌వి 2012 మోడల్‌ను పక్కన ఉన్న చిత్రంలో చూడొచ్చు. ప్రీమియం ఎమ్‌పివి విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్ వంటి విలాసవంతమైన కార్లకు మరింత గట్టి పోటీని ఇచ్చేందుకు కంపెనీ హోండా సిఆర్‌విలో కొన్ని మార్పులు చేసి సరికొత్త లుక్‌తో విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న హోండా సిఆర్‌వితో పోలిస్తే... 2012 హోండా సిఆర్‌వి కాస్తంత పెద్దదిగా ఉండే అవకాశం ఉంది.

వెనుక క్యాబిన్ పరిమాణాన్ని కూడా కొంచె పెంచినట్లు తెలుస్తుంది. ఇంకా.. స్పోర్టీ లుక్ కోసం ఫ్రంట్ డిజైన్‌ను మార్చారు. దీని హెడ్ ల్యాంప్స్ కూడా చూడటానికి హోండా అకార్డ్ సెడాన్ కారు స్టైల్‌ను పోలి ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మైలేజ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నందున దీని డిజైన్‌ ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోపడేలా రూపొందించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సిఆర్‌వి కన్నా దీని కలర్, మరియు ఫీచర్స్ కొనుగోలుదారులను కట్టి పడేస్తాయనడంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. కొత్త హోండా సిఆర్‌వి విడుదల కోసం ఇప్పటికే కార్ లవర్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, July 28, 2011, 12:45 [IST]
English summary
The Honda CRV has been one of the Japanese carmaker's top selling models. The CRV was due for an update and Honda has dome it with a bang. The carmaker which was teasing fans with a website on the new 2012 CRV has finally released an official image of the MPV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+