సెప్టెంబర్ నెలలో ఫలించని హోండా సీటీ, జాజ్ మంత్రం..

Honda Siel Cars
కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ వేసిన సిటీ, జాజ్‌ల డిస్కౌంట్ మంత్రం ఫలించలేదు. హోండా సిటీ సెడాన్ కారుపై రూ.66,000 తగ్గింపును, హోండా జాజ్‌పై హ్యాచ్‌బ్యాక్‌పై సుమారు రూ.1.75 లక్షల భారీ డిస్కౌంట్‌ను ప్రకటించినప్పటికీ.. సెప్టెంబర్ నెలలో అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్ 2011 నెలలో హోండా 4,758 కార్లను విక్రయించి గతేడాది ఇదే నెలతో పోలిస్తే 38.43 శాతం క్షీణతను నమోదు చేసుకుంది.

సెప్టెంబర్ 2010లో మొత్తం 7,728 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. సెప్టెంబర్ 2011 మొత్తం అమ్మకాలలో 596 జాజ్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఉండగా, 3,720 సిటీ సెడాన్ కార్లున్నాయి. కాగా.. 117 సివిక్ ప్రీమియం సెడాన్ కార్లను, 137 అకార్డ్ లగ్జరీ సెడాన్ కార్లను, 17 సిఆర్-వీ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను మరియు 171 బ్రయో కార్లను విక్రయించినట్లు హోండా పేర్కొంది. కంపెనీ ఇటీవలే బ్రయో కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ నెలలో అయినా బ్రయో మ్యాజిక్ పనిచేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

More from DriveSpark

Article Published On: Sunday, October 2, 2011, 11:53 [IST]
English summary
Honda Siel Cars India today said it sold 4,758 units in September, registering a decline of 38.43 per cent over the same period last year. The company had sold 7,728 units in the corresponding month last year, Honda Siel Cars India (HSCI) said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+