హోండా సియోల్ కార్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ సెడాన్ వేరియంట్ కారు 'సిటీ' ధరలను రూ. 66,000 వరకూ తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వివిధ మార్గాల్లో వ్యయ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్న ఫలితంగా వినియోగదార్లపై ధరల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ సీనియర్ అధ్యక్షుడు (మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. ప్రస్తుతం సిటీ సెడాన్ కార ధరలు రూ. 7.49 నుంచి రూ.9.89 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) ఉంది.