జులై వరకూ పూర్తిస్థాయిలో ఉత్పత్తి కష్టమే: హోండా సియోల్ కార్స్

భారత్‌లోని కార్ల తయారీ సంస్థ సియోల్ గ్రూపుతో జపాన్‌కు చెందిన హోండా మోటార్ కార్పోరేషన్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సియోల్ గ్రూపుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఏటా ఒక లక్ష వాహనాలను ఉత్పత్తి చేసే ప్లాంటును కలిగి ఉంది. ప్రస్తుతం విడిభాగాల సరఫరా పరిస్థితి అంతగా బాగోలేదని, అందుకే మే నెల వరకూ 50 శాతం ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించామని, అయితే ఈ పరిస్థితి మరో మూడు నెలల పాటు కొనసాగే సూచనలు కనబడుతున్నాయని హోండా సియోల్ కార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ వెల్లడించారు.
ఈ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటే పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఉత్పత్తి తగ్గింపులో భాగంగా కంపెనీ గ్రేటర్ నోయిడాలోని ప్లాంటులో మే, 2011 నుంచి ఒక షిఫ్టును మాత్రమే నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాంటు ద్వారా నెలకు దాదాపు 5,000 వాహనాలను కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. రాజస్థాన్‌లోని తపుకరాలో ఏటా 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయగల రెండో ప్లాంటును కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ ప్లాంటు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. అలాగే.. మార్చి 17న విడుదల కావాల్సిన తమ తొలి చిన్న కారు "బ్రయో" విడుదలను కూడా కంపెనీ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








