హోండా సిటీ ఉత్పత్తి నిలిపివేత.. తర్వాత బ్రయోనే..!!

Honda City - Brio
దేశీయ మార్కెట్లో హోండా సియోల్ కార్స్ ఇండియా (హెచ్ఎస్‌సిఐ) నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ సెడాన్ 'హోండా సిటీ' సెడాన్ ఉత్పత్తి నిలిచిపోయింది. థాయ్‌లాండ్‌లో తలెత్తిన వరదల కారణంగా, విడి భాగాల కొరత ఏర్పడంతో సిటీ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేస్తున్న హోండా సియోల్ ఓ ప్రకటనలో పేర్కొంది. విడిభాగాల కొరత కారణంగా తమ ఉత్పత్తి భారీగా దెబ్బతింటోందని కంపెనీ వెల్లడించింది.

కాగా... థాయ్‌లాండ్ వరదల కారణంగా ఏర్పడిన విడిభాగాల కొరత, కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన బ్రయో మోడల్‌పై కూడా పడుతోందని, త్వరలోనే ఈ మోడల్‌ ఉత్పత్తి కూడా నిలిచిపోయే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఏదేమైనప్పటికీ, విడిభాగాల కోసం ప్రత్యామ్నాయంగా జపాన్, చైనా వంటి దేశాలపై హోండా ఆధారపడుతోంది.

మరోవైపు డిసెంబర్ నెలల సరికొత్త ఫేస్‌లిఫ్ట్ సిటీ సెడాన్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సిటీ సెడాన్ స్టాక్ (ఇన్వెంటరీ)ను క్లియర్ చేసుకునేందుకే హోండా నిర్ణయం తీసుకున్నట్లు విమర్శకులు భావిస్తున్నారు. హోండా పాత సిటీ సెడాన్ ఉత్పత్తిని ఇంకా కొనసాగిస్తే, కొత్త సిటీ సెడాన్‌ను వచ్చే నాటికి వీటి స్టాక్‌ను క్లియర్ చేసుకోలేదు.

ఫలితంగా సిటీ సెడాన్ ఇన్వెంటరీ భారీగా పెరిగిపోయి సదరు పాత మోడల్‌ను ఆదరించే వారి సంఖ్య తగ్గపోతుంది. దీంతో అమ్మకాలు పెంచుకునేందుకు సదరు మోడల్‌పై మరోసారి భారీ డిస్కౌంట్లను హోండా ప్రకటించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులన ముందుగానే ఊహించిన హోండా, సిటీ ఉత్పత్తని నిలిపివేసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, November 24, 2011, 14:42 [IST]
English summary
Honda has announced it will cut production of its top selling sedan City as well as its recently launched small car Brio after the supply of spare parts for these cars were disrupted due to the severe floods in Thailand. Honda has also said it would be reducing production of the Jazz and Accord too.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+