భారత్ కోసం తొలి డీజిల్ ఇంజన్‌ను ఆవిష్కరించిన హోండా

Honda Civic
దశాబ్ధాలుగా భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తు జపాన్ ఆటో దిగ్గజం హోండా, భారతీయలకు మరో తీపికబురును మోసుకువచ్చింది. భారత్‌లో ఇప్పటి వరకూ పెట్రోల్ కార్లను మాత్రమే అందిస్తూ వచ్చిన హోండా త్వరలోనే డీజిల్ కార్లను కూడా అందించేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ నేపథ్యంలో భారతీయ మోడళ్లకు సరిపోయే విధంగా రూపొందించిన తొలి డీజిల్ ఇంజన్‌ను హోండా ఆవిష్కరించింది. భారత మార్కెట్లో డీజిల్ ఇంజన్ల పట్ల పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని జపాన్‌లో డీజిల్ కార్లను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే వీటిని దేశీయ విపణిలోకి ప్రవేశపెడతామని కంపెనీ పేర్కొంది.

హోండా ఆవిష్కరించిన 1.6 లీటర్ ఐ-డిటెక్ టర్బో డీజిల్ ఇంజన్ 4,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్ట శక్తిని, 2,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 170 కేజీలు మాత్రమే బరువు ఉండే ఈ ఇంజన్ ఈ క్లాస్‌లోన్ అత్యంత తేలికైనది. దీన్ని 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో అనుసంధానం చేయవచ్చు.

అయితే, దీనికి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌కు అనుసంధానించవచ్చా లేదే అనే విషయంపై కంపెనీ వైపు నుంచి ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. హోండా ఆవిష్కరించిన 1.6 లీటర్ ఐ-డిటెక్ టర్బో డీజిల్ ఇంజన్‌ను తొలిసారిగా కంపెనీ అందిస్తున్న ప్రీమియం సెడాన్ సివిక్‌లో ఉపయోగించనుంది. 2013 ఆరంభంలో కానీ లేదా అంతకన్నా ముందే కానీ హోండా డీజిల్ కార్లు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 1, 2011, 12:02 [IST]
English summary
Japanese auto major Honda Motor Co. has unveiled its first 1.6 Liter i-DTEC turbo diesel engine for Indian market. This can generate a peak power of 120 Bhp 4,000 rpm and peak torque 300 Nm 2,000 rpm.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+