కరోలాపై భారీ డిస్కౌంట్ (పెట్రోల్ వేరియంట్ మాత్రమే)

Toyota Corolla Offer
దీపావళి అయిపోంది కదా..! ఇంకా ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు ఏంటి అనుకుంటున్నారా..? నిజమే ఇవి ఫెస్టివ్ డిస్కౌంట్లు కాదు.. స్టాక్ క్లియరింగ్ డిస్కౌంట్లు. మరి కొద్ది వారాల్లోనే పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వస్తుంది కదా.. ఈ నేపథ్యంలో.. పాత సంవత్సరం(2011)లో తయారైన మోడళ్ల స్టాక్ క్లియర్‌ను చేసుకునేందుకు ఆటో కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

ఇందులో భాగంగానే టొయోటా కిర్లోస్కర్ మోటార్ అందిస్తున్న ఎగ్జిక్యూటివ్ సెడాన్ కరోలా ఆల్టిస్‌పై రూ.20,000 మొదలుకొని రూ.50,000 వరకూ తగ్గింపును ఆఫర్ చేస్తుంది. అయితే ఈ ఆఫర్ కేవలం పెట్రోల్ వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్ కరోలా ఆల్టిస్ సెడాన్ ధర రూ.10.8 లక్షల నుండి రూ.15.5 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉంది.

వాస్తవానికి ప్రస్తుత సీజన్‌లో డీజిల్ కార్లపై పెద్దగా ఆఫర్లు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. త్వరలో ప్రభుత్వం డీజిల్ కార్లపై సుంఖాన్ని పెంచనుందనే వార్తలు, అడ్డు అదుపూ లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో డీజిల్ కార్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీంతో పెట్రోల్ కార్లను కొనేవారు కరువై వాటి స్టాక్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతుంది.

ఈ పరిస్థితుల్లో పెట్రోల్ కార్ల స్టాక్‌లను క్లియర్ చేసుకునేందుకు అటు కంపెనీలు ఇటు డీలర్లు నానా తంటాలు పడుతున్నారు. ఏదైతేనేం... తక్కువ ధరకే పెట్రోల్ కారును సొంతం చేసుకోవలనుకునే వారికి ఇదే సరైన తరుణం. మరి మీరు పెట్రోల్ కారును కొంటున్నారా..??

More from DriveSpark

Article Published On: Saturday, November 5, 2011, 16:55 [IST]
English summary
Carmakers usually offer discounts and other offers to increase sales or to clear stocks. The Toyota Corolla is arguably the best selling car in its mid size executive sedan class. Yet Toyota has decided to offer a discount ranging from Rs.20,000 to Rs.50,000 for the petrol variant only. The petrol variant of the Corolla costs between Rs.10.8 lakhs and Rs.15.5 lakhs (ex showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+