ప్రపంచ కప్ కారును తయారుచేసిన హైదరాబాదీ

World Cup Car
ప్రపంచ కప్‌లో భారత జట్టు గెలవాలని అభిమానులు వినూత్న శైలిలో ప్రచారం చేస్తూ.. క్రికెట్‌పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన కె సుధాకర్ అనే వ్యక్తి ప్రపంచ కప్ ఆకారంలో ఉండే ఓ బుజ్జి కారును రూపొందించి చూపరలను ఆకట్టుకున్నారు. ఈ బుజ్జి కారుకు "ఐసిసి వరల్డ్ కప్ కార్" అని పేరు పెట్టారు.

ఒక్కరు మాత్రమే కూర్చుని ప్రయాణించగల ఈ కారు మూడు చక్రాలపై పరుగులు తీస్తుంది. 6 అడుగుల వ్యాసం, 11 అడుగుల 10 ఇంచ్‌ల ఎత్తు ఉండేలా దీనిని రూపొందించారు. ఈ కారులో సుధాకర్ 150 సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, దీనిని కేవలం 36 గంటల్లో 16 మంది సహాయంతో తయారు చేశానని సుధాకర్ వెల్లడించారు.

ఈ కారు తయారీ కోసం రూ. 13,000 ఖర్చు చేశామని ఆయన చెప్పారు. 2003లో కూడా ప్రపంచ కప్ సమయంలో క్రికెట్ బంతి ఆకారంలో ఉండే కారును, అలాగే 2007 ప్రపంచ కప్‌లో క్రికెట్ బ్యాట్ ఆకారంలో ఉండే కారును రూపొందించారు. 1983 తర్వాత ప్రపంచ కప్‌ను గెలుచుకునేందుకు భారత్‌కు ఇదొక మంచి అవకాశమని ఈసారి ఖచ్చితంగా భారత్ ప్రపంచ కప్‌ను గెలుస్తుందని సుధాకర్ ధీమా వ్యక్తం చేశారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 31, 2011, 16:47 [IST]
English summary
Noted car designer K. Sudhakar has built a car resembling the ICC Cricket World Cup 2011 trophy. The World Cup car is a single-seater moving on three wheels. It is powered by a 150 CC engine and the car’s top speed is 70 Kmph.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+