రెండు సిఎన్‌బిసి టివి18 అవార్డులను దక్కించుకున్న హ్యుందాయ్

మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో హ్యుందాయ్ గడచిన మే నెలలో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త వెర్నా ఫ్లూయిడిక్ సెడాన్ "మిడ్‌సైజ్‌డ్ కార్ ఆఫ్ ది ఇయర్" అవార్డును సొంతం చేసుకోగా, కాంపాక్ట్/స్మాల్ కార్ సెగ్మెంట్లో కంపెనీ అందిస్తున్న బుజ్జి కారు ఇయాన్ "మైక్రో/మినీ కార్ ఆఫ్ ది ఇయర్" అవార్డును సొంతం చేసుకుంది.
హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా ఈ అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) అరవింద్ సక్సేనా మాట్లాడుతూ.. ఇయాన్ వెర్నా కార్లను గుర్తించినందుకు సిఎన్‌బిసి టివి18 ధన్యవాదములు తెలియజేస్తున్నామని, ఈ రెండు కార్లకు కూడా మార్కెట్లో మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు.
గతంలో ప్రవేశపెట్టిన హ్యుందాయ్ వెర్నా సెడాన్‌కు మరిన్ని హంగులు దిద్ది, అధునాతన ఫీచర్లను జోడించి గడచిన మే నెలలో 'వెర్నా ఫ్లూయిడిక్' పేరుతో కంపెనీ విడుదల చేసింది. దీని విశిష్టమైన లుక్, ఆకర్షనీయమైన ఫీచర్లతో భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇది నాలుగు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.
అవి, 1.4 లీటర్ పెట్రోల్ విటివిటి ఇంజన్, 1.6 లీటర్ పెట్రోల్ విటివిటి ఇంజన్, 1.4 లీటర్ డీజిల్ కామన్ రైల్ సిఆర్‌డిఐ ఇంజన్, 1.6 లీటర్ డీజిల్ విజిటి సిఆర్‌డిఐ ఇంజన్. 1.6 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభించే వెర్నా కారు 4- ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తాయి. అలాగే, నాలుగు వేరియంట్లు కూడా మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌లతో కూడా లభిస్తాయి.


Click it and Unblock the Notifications








